రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’ విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ చేతిలో గన్‌తో కనిపిస్తున్న పవర్ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసి అభిమానుల్లో అంచనాలను మరింత పెంచారు. పోస్టర్‌కు ‘అజ్ఞాతపర్వం ముగిసింది… తిరుగుబాటు ప్రారంభమైంది’ అనే ఆకట్టుకునే క్యాప్షన్‌ను జత చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వి నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.