ఓటీటీలోకి ‘మా ఇంటి బంగారం’ మాస్ ఎంట్రీ.. 4 భాషల్లో సమంత సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్ ..!

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ థియేటర్లలో ఘన విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుని రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి తెలుగు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ సినిమా,ఈరోజు అర్ధరాత్రి నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రావడంతో మంచి ఆదరణ లభిస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సమంత ట్రాలాలా పిక్చర్స్‌పై నిర్మించారు. దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి తదితరులు కీలక పాత్రలు పోషించగా, సంతోష్ నారాయణన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress