‘లెనిన్’ సినిమా విజయంతో కొత్త ఉత్సాహంలో ఉన్న హీరో అఖిల్ గుంటూరులో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో భావోద్వేగంగా మాట్లాడారు. గత మూడేళ్లుగా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సమయంలో తన భార్య జైనబ్ అండగా నిలిచి ధైర్యం ఇచ్చిందని తెలిపారు. తండ్రి నాగార్జున తనను ఎప్పుడూ నిరుత్సాహపరచకుండా స్నేహితుడిలా వెన్నంటి నిలిచారని చెప్పారు. ‘లెనిన్’ విజయంతో తనలో కొత్త ప్రయాణం ప్రారంభమైందని, అభిమానుల ప్రేమకు తగిన ప్రతిఫలం ఇవ్వడానికి మరింత కష్టపడతానన్నారు. విజయం వచ్చినా గర్వపడనని, ప్రశాంతంగా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకుల ఆశలను నిలబెట్టే చిత్రాలు అందించడమే తన లక్ష్యమని అఖిల్ స్పష్టం చేశారు.
ప్రజా తీర్పుతో అఖిల్‌కు కొత్త బలం.. మూడేళ్ల పోరాటానికి ‘లెనిన్’తో విజయ ముద్ర..!
