త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’ మరో ఓటీటీ వేదికలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. గతేడాది చివర్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండగా, తాజాగా జియో హాట్‌స్టార్‌లోనూ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిరి హనుమంతు, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. దెయ్యాలు లేవని నమ్మే నలుగురు స్నేహితులు ఓ బాబా విసిరిన సవాల్‌ను స్వీకరించి మూడు రోజుల పాటు పాడుబడిన బంగ్లాలో గడపడానికి సిద్ధమవుతారు. ఆ తర్వాత ఎదురైన భయానక సంఘటనలు, అనూహ్య మలుపులే సినిమా కథకు ప్రధాన ఆకర్షణ.
ఓటీటీలోకి మరోసారి హారర్ థ్రిల్లర్ ‘ఈషా’.. ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్..!
